వీ చాట్‌ యాప్‌ బ్యాన్‌పై కాలిఫోర్నియా కోర్టు స్టే

ABN , First Publish Date - 2020-09-22T16:04:36+05:30 IST

చైనాకు చెందిన షేరింగ్‌ యాప్‌ వుయ్‌ చాట్‌పై విధించిన నిషేధం మీద కాలిఫోర్నియాలోని ఓ కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది.

వీ చాట్‌ యాప్‌ బ్యాన్‌పై కాలిఫోర్నియా కోర్టు స్టే

ట్రంప్‌ ఉత్తర్వులను నిలిపేసిన కోర్టు

కాలిఫోర్నియా, సెప్టెంబరు 21: చైనాకు చెందిన షేరింగ్‌ యాప్‌ వుయ్‌ చాట్‌పై విధించిన నిషేధం మీద కాలిఫోర్నియాలోని ఓ కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఈ యాప్‌ను యాపిల్‌, గూగుల్‌ ప్లేస్టోర్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడాన్ని 20 వ తేదీ నుంచి నిషేధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ కొందరు కోర్టుకెక్కారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న మొదటి సవరణ మీద పిటిషనర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని జడ్జి లారెల్‌ బీలర్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-22T16:04:36+05:30 IST