రేపు తెలంగాణ కేబినెట్‌ ప్రత్యేక సమావేశం

ABN , First Publish Date - 2020-04-10T20:21:12+05:30 IST

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ప్రత్యేక సమావేశం శనివారం జరగనుంది

రేపు తెలంగాణ కేబినెట్‌  ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ప్రత్యేక సమావేశం శనివారం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 3గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ కేబినెట్‌ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం వుంది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించే అంశం, రాష్ట్రఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్‌ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు, ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం వుంది. 

Updated Date - 2020-04-10T20:21:12+05:30 IST