దేశవ్యాప్తంగా బీజేపీ క్రమ క్రమంగా బలహీన పడుతోంది: బీవీ రాఘవులు

ABN , First Publish Date - 2022-04-17T18:28:49+05:30 IST

దేశవ్యాప్తంగా బీజేపీ క్రమ క్రమంగా బలహీన పడుతోందని బీవీ రాఘవులు అన్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ క్రమ క్రమంగా బలహీన పడుతోంది: బీవీ రాఘవులు

అమరావతి: దేశవ్యాప్తంగా బీజేపీ క్రమ క్రమంగా బలహీన పడుతోందని, మళ్ళీ బలపడటానికి మత ఘర్షణలు తెరపైకి తీసుకురావాలని చూస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడేకొద్ది బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టె అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి, సంఘ్ పరివార్‌కు మద్దతు ఇస్తున్నాయని, మరీ ముఖ్యంగా వైసీపీ బీజేపీతో అంటకాగుతోందని ఆరోపించారు. చెత్త పన్ను, విద్యుత్ చార్జీలు పెంచమని కేంద్రం ఒత్తిడి తేవడంతోనే ఏపీ సర్కారు పెంచిందన్నారు. కేంద్రం ఒత్తిడి చేస్తే సీఎం జగన్ ఎందుకు తలొగ్గారని ప్రశ్నించారు. నెల్లూరు కోర్టులో ఆధారాలు దొంగిలిస్తే ప్రభుత్వం ఏమి చేస్తోందన్నారు. సీసీ కెమెరాల ద్వారా 5 నిమిషాల్లో దొంగలు దొరుకుతుంటే పోలీసు యంత్రాంగం ఏమి చేస్తుందని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల అనుమతి లేనిదే కోర్టులో దొంగతనం జరుగుతుందా?.. నెల్లూరు కోర్టులో ఆధారాల మాయంపై సిట్ వేసి వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ముందుకు వస్తే టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని బీవీ రాఘవులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-17T18:28:49+05:30 IST