ధాన్యం కొనుగోలు చేయరేం?

ABN , First Publish Date - 2020-11-29T06:17:03+05:30 IST

‘ధాన్యం కొనుగోలు చేయండి.. మహాప్రభో..’ అంటూ రైతన్నలు రోడ్డెక్కారు. పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఈ ఆందోళనలు

ధాన్యం కొనుగోలు చేయరేం?

రోడ్డెక్కిన రైతన్నలు.. పలు జిల్లాల్లో ఆందోళనలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘ధాన్యం కొనుగోలు చేయండి.. మహాప్రభో..’ అంటూ రైతన్నలు రోడ్డెక్కారు. పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఈ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ధాన్యం కొనుగోలు చేసినా తరలింపులో జాప్యం జరుగుతుండటంపై జనగామ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగేశ్వర శర్మ, మార్కెట్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి జీవన్‌ కుమార్‌ రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండల రైతులు రోడ్డెక్కారు. శనివారం 44వ నెంబరు జాతీయ రహదారిపై మూసాపేట దగ్గర రాస్తారోకో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు తమను ముంచుతోందంటూ రైతులు వాపోయారు.

Updated Date - 2020-11-29T06:17:03+05:30 IST