Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిరప పంట దగ్ధం

గుంటూరు: ఓ మిర్చి రైతు కష్టార్జితం నిప్పులపాలయింది. జిల్లాలోని నూజెండ్ల మండలం ములకలూరులో మిరప పంట దగ్ధమయింది. గ్రామానికి చెందిన  రైతు వెంకటేష్‌ తనకు ఉన్న 2 ఎకరాలలో మిరప పంటను వేశాడు. అయితే పంటకు మంటలు అంటుకోవడంతో అగ్నికి ఆహూతయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలార్పారు. పెట్రోల్‌ పోసి తన మిర్చి పంటను తగులబెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.  

Advertisement
Advertisement