Advertisement
Advertisement
Abn logo
Advertisement

బంగ్లాకు ఐర్లాండ్‌ షాక్‌

వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌

అబుధాబి: టీ20 వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాకిచ్చింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 33 పరుగులతో బంగ్లాపై నెగ్గింది. తొలుత గారెత్‌ డెలానీ (88 నాటౌట్‌) అర్ధ సెంచరీతో రాణించడంతో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 144 రన్స్‌కే ఆలౌటై ఓడింది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 19 పరుగులతో నమీబియాపై గెలుపొం దింది. అలాగే నెదర్లాండ్స్‌ 4 పరుగులతో ఒమన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. కాగా, ఈ నెల 18న జరగనున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ పోటీపడనుంది. 

Advertisement
Advertisement