నవంబరు 1 నుంచి బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు!

ABN , First Publish Date - 2022-08-08T20:29:00+05:30 IST

ఈ ఏడాది బీటెక్‌ ఫస్టియర్‌ క్లాసులు నవంబరు 1 నుంచి ప్రారంభించాలని సాంకేతిక విద్యా అధికారులు భావిస్తున్నారు. తరగతులను అక్టోబరు 10 నుంచి ప్రారంభించాల్సి ఉన్నా..

నవంబరు 1 నుంచి బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు!

హైదరాబాద్: ఈ ఏడాది బీటెక్‌ ఫస్టియర్‌ క్లాసులు నవంబరు 1 నుంచి ప్రారంభించాలని సాంకేతిక విద్యా అధికారులు భావిస్తున్నారు. తరగతులను అక్టోబరు 10 నుంచి ప్రారంభించాల్సి ఉన్నా... ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌ ఆలస్యంగా జరిగే అవకాశం ఉండటంతో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌తో సీట్ల భర్తీ సైతం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబరు 1 నుంచి ఫస్టియర్‌ క్లాసులను ప్రారంభించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. 


1.11 లక్షలకుపైగా ఇంజనీరింగ్‌ సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం2022-23కిగాను మొత్తంగా 1,11,147 ఇంజనీరింగ్‌ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. ఈ కోర్సులు, సీట్లకు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీట్లను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. 

Updated Date - 2022-08-08T20:29:00+05:30 IST