తిరుమల: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుమల కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారిలోని హరిణి దగ్గర రాళ్లు పడ్డాయి. భారీ వర్షంతో పాపవినాశనం రహదారిని టీటీడీ మూసివేసింది. భారీవర్షాలతో తిరుపతి జలమయమైంది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాలతో రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగడం లేదు.