ట్రంప్‌కు బోరిస్‌ జాన్సన్‌ ఫోన్‌

ABN , First Publish Date - 2020-03-29T09:30:17+05:30 IST

కరోనాతో స్వీయ నిర్బంధంలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా జాన్సన్‌ త్వరగా కోలు

ట్రంప్‌కు బోరిస్‌ జాన్సన్‌ ఫోన్‌

లండన్‌: కరోనాతో స్వీయ నిర్బంధంలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని ట్రంప్‌ అభిలషించారు. జి-7, జి-20 దేశాలతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి కరోనాపై ఉమ్మడి పోరాటానికి నిర్ణయించారు. దీనికిముందే జాన్సన్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘మీరొక పోరాట యోధుడు. ఈ సవాల్‌ను అధిగమిస్తారు. మీకోసం, ఆరోగ్యవంతమైన బ్రిటన్‌ కోసం నా ప్రార్థనలు ఫలిస్తాయి’ అని ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-29T09:30:17+05:30 IST