Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రైట్‌కామ్‌ చేతికి మీడియామింట్‌

  డీల్‌ విలువ రూ.566 కోట్లు

  యాడ్‌-టెక్‌ రంగంలో అతిపెద్ద డీల్‌!


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మీడియామింట్‌ బ్రాండ్‌తో డిజిటల్‌ మార్కెటింగ్‌  సేవలందిస్తున్న ఊచి మీడి యా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ (బీసీజీ) సొంతం చేసుకుంది. 100 శాతం వాటాను రూ.566 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2010లో ఏర్పాటు చేసిన మీడియామింట్‌ యాడ్‌ కార్యకలాపాలు, క్యాంపెయిన్‌ మేనేజ్‌మెంట్‌, క్రియేటివ్‌ సర్వీసెస్‌, డేటా ఎనలిటిక్స్‌, డెవ్‌ యాప్‌ తదితరాల్లో ఎండ్‌-టు-ఎండ్‌ డిజిటల్‌ కన్సల్టింగ్‌, ఇతర సేవలను అందిస్తోంది. పబ్లిషర్లకు, యాడ్‌ ఏజెన్సీలకు, ఇతర ప్లాట్‌ఫామ్స్‌కు డిస్‌ప్లే, వీడియో, మొబైల్‌ అడ్వర్‌టైజింగ్‌ సేవలందిస్తోంది. మీడియామింట్‌కు భారత్‌, పోలెండ్‌, అమెరికాలో కార్యాలయాలు ఉన్నాయి. కాగా బ్రైట్‌కామ్‌ (గతంలో లైకోస్‌ ఇంటర్నెట్‌) యాడ్‌-టెక్‌ పరిశ్రమలో అగ్రగామి కంపెనీ. బ్రైట్‌కామ్‌ ఖాతాదారుల జాబితాలో ఎయిర్‌టెల్‌, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, కోకాకోలా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఎల్‌ఐసీ, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు ఉన్నాయి. 

నగదు, ఈక్విటీలో చెల్లింపులు

మీడియామింట్‌ కొనుగోలు కోసం రూ.566 కోట్లను నగదు, ఈక్విటీ రూపంలో బ్రైట్‌కామ్‌ చెల్లిస్తుంది. ఇందులో రూ.360 కోట్ల నగదును కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే సమయంలో, రూ.170 కోట్ల మొత్తాన్ని బీసీజీ షేర్ల రూపంలో చెల్లిస్తారు. డీల్‌ పూర్తయిన ఆరు నెలల్లో మరో రూ.36 కోట్ల చెల్లింపు జరుగుతుంది. డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ రంగంలో బహుశా ఇదే అతిపెద్ద కొనుగోలు కావచ్చని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మీడియామింట్‌ ఆదాయం రూ.187 కోట్లుగా ఉంటుందని అంచనా. 

1300 మంది ఉద్యోగులు

మీడియామింట్‌లో 1,300 మందికి పైగా ఉద్యోగులు ఉన్నా రు. న్యూయార్క్‌ టైమ్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, కాక్స్‌ ఆటోమోటివ్‌, ఎక్స్‌పీడియా వంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌కు మీడియామింట్‌ సేవ లందిస్తోంది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా మీడియామింట్‌ లీడర్‌షిప్‌ బృందం.. సహ వ్యవస్థాపకురాలు నీలిమా మారుపూరు, అనుష్‌ కుమార్‌, జాసన్‌రిబక్‌  కంపెనీలో కొనసాగుతారు. సహ వ్యవస్థాపకుడు ఆదిత్య ఊచి ఆరు నెలలపాటు ఉంటారు. కంపెనీ చేతులు మారేందుకు సహాయపడతారు బ్రైట్‌కామ్‌తో కలవడం సంతోషంగా ఉందని మీడియామింట్‌ సహ వ్యవస్థాపకురాలు నీలిమా అన్నారు.  

Advertisement
Advertisement