బ్రెజిల్‌లో కరోనా కల్లోలం.. 24గంటల్లో మరణించిన వారి సంఖ్య ఎంతంటే..!

ABN , First Publish Date - 2020-05-18T02:29:16+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో కూడా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో.. 14,919 క

బ్రెజిల్‌లో కరోనా కల్లోలం.. 24గంటల్లో మరణించిన వారి సంఖ్య ఎంతంటే..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో కూడా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో.. 14,919 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2.33లక్షలకు చేరింది. ఇదే సమయంలో కరోనా కాటుకు 816 మంది బలవ్వగా.. మహమ్మారి కారణంగా బ్రెజిల్‌లో మృతి చెందిన వారి సంఖ్య 15,662కు చేరంది. కాగా.. కరోనా కేసుల విషయంలో ఇటలీ, స్పెయిన్‌లను బ్రెజిల్ దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్ 4వస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 47లక్షలు దాటింది. ఇప్పటి వరకు 3.13లక్షల మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. 


Updated Date - 2020-05-18T02:29:16+05:30 IST