బ్రెజిల్‌లో 18 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-15T02:52:19+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తూనే ఉంది. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న

బ్రెజిల్‌లో 18 లక్షలు దాటిన కరోనా కేసులు

బ్రసిలియా: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తూనే ఉంది. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో కేసుల ఏ మాత్రం తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 20,286 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో దేశంలో 733 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 72,833కు చేరింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 11 లక్షలకు పైగా పూర్తిగా కోలుకున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, రష్యా, పెరు దేశాలున్నాయి. కేసుల విషయంలో అమెరికా ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 33 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-07-15T02:52:19+05:30 IST