Abn logo
Mar 26 2020 @ 16:15PM

బాక్సర్ ఆమిర్‌ఖాన్ పెద్ద మనసు!

లండన్: కరోనా మహమ్మారిపై పోరుకు బ్రిటిష్ ప్రొఫెషనల్ బాక్సర్ ఆమిర్‌ఖాన్ (33) ముందుకొచ్చాడు. కోవిడ్-19పై యూకే చేస్తున్న పోరాటానికి తన వంతు సాయం ప్రకటించాడు. ఇలాంటి ఆపత్కాల సమయంలో ఆసుపత్రిలో బెడ్ దొరకడం ఎంత కష్టమో తనకు తెలుసని పేర్కొన్నాడు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తన నాలుగు అంతస్తుల భవనాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. 60 వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం వెడ్డింగ్ హాలు, రిటైల్ అవుట్‌లెట్ ఉన్నాయి. 


ఆమీర్‌ఖాన్ లైట్-వెల్టర్‌వెయిట్ వరల్డ్ మాజీ చాంపియన్. 2009 నుంచి 2012 వరకు వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ చాంపియన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం యూకేలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీటికి అడ్డుకట్ట వేయకపోతే ఆసుపత్రుల్లోని బెడ్‌లు సరిపోవన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే బాక్సర్ ముందుకొచ్చాడు. తన నాలుగు అంతస్తుల భవనాన్ని రోగుల చికిత్స కోసం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు.  

Advertisement