సీపీఎస్ పై బొత్స అనధికార దౌత్యం?

ABN , First Publish Date - 2022-08-24T08:33:10+05:30 IST

సీపీఎస్ పై బొత్స అనధికార దౌత్యం?

సీపీఎస్ పై బొత్స అనధికార దౌత్యం?

అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సీఎం ఇల్లు ముట్టడి, చలో విజయవాడ కార్యక్రమాలు విజయవంతమైతే పరువుపోతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబరు 1న వాటిని జరుగనివ్వకూడదని భావిస్తున్నారు. నయానో భయానో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలను దారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ తీసుకున్నారు. వారితో అనధికారికంగా రాయబారం నెరపుతున్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం చర్చించుకుందాం రమ్మని కబురు పంపారు. తన సిబ్బంది ద్వారా వారిని ఆహ్వానించినట్లు తెలిసింది. ఆ నాయకులు కూడా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ భేటీలో కూడా బొత్స గత మంత్రుల కమిటీ సమావేశంలో చెప్పినట్లు జీపీఎ్‌సకే కట్టుబడి ఉన్నామని చెబుతారా.. లేక మరేదైనా కొత్త ప్రతిపాదన వారి ముందుంచుతారా అనేది సమావేశం అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-08-24T08:33:10+05:30 IST