విరసం నేత రామ్మోహన్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2022-03-09T09:10:56+05:30 IST

విప్లవరచయితల సంఘం పూర్వ కార్యవర్గ సభ్యుడు చుక్కంబొట్ల రామ్మోహన్‌ (74) ఇకలేరు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని స్వగృహంలో కన్నుమూశారు.

విరసం నేత రామ్మోహన్‌ కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, మన్సూరాబాద్‌ మార్చి 8 (ఆంధ్రజ్యోతి): విప్లవరచయితల సంఘం పూర్వ కార్యవర్గ సభ్యుడు చుక్కంబొట్ల రామ్మోహన్‌ (74) ఇకలేరు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కదిరెపాడుకు చెందిన రామ్మోహన్‌ తెలుగు ఉపాధ్యాయుడిగా, కాలేజీ అధ్యాపకుడిగా పనిచేశారు. 2006లో పదవీ విరమణ చేశారు. ఆయన భార్య భారతి 20 ఏళ్ల క్రిత మే కన్నుమూశారు. హరిప్రసాద్‌, సుజన్‌కుమార్‌, శ్రీకాంత్‌ ముగ్గురు కొడుకులు. ఏపీటీఎఫ్‌ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. పాలమూరు ప్రాంత వలసగోసను ప్రపంచానికి చాటిన ఉద్యమకారుల్లో రామ్మోహన్‌ ముఖ్యులు. 1969ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సామాజిక, ఆర్థిక, సాహిత్య రంగాలపై పలు వ్యాసాలు రాశారు. రామ్మోహన్‌ భౌతికకాయానికి  ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌, పీవోడబ్ల్యూ సంఽధ్య, కవయిత్రి విమల, టీజేఎస్‌ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ తదితరులు నివాళులర్పించారు. రామ్మోహన్‌ అంత్యక్రియలు వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికలో ముగిశాయి. 

Updated Date - 2022-03-09T09:10:56+05:30 IST