ఆ Bills ఇవ్వడం లేదు: Bopparaju

ABN , First Publish Date - 2022-07-15T20:45:14+05:30 IST

ప్రభుత్వాలు, అధికారుల మాటలు విని విని విసిగిపోయామని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ఆ Bills ఇవ్వడం లేదు: Bopparaju

అమరావతి: ప్రభుత్వాలు, అధికారుల మాటలు విని విని విసిగిపోయామని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రస్తుత హెల్త్కార్డులు.. అన్ హెల్తీకార్డులుగా మారిపోయాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్యం కోసం రూ.200 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. అత్యవసర వైద్యానికి కూడా హెల్త్ కార్డు(Health card) పట్టుకుని.. ఆస్పత్రుల అనుమతుల కోసం తిరగాల్సి వస్తోందని చెప్పారు. అప్పు చేసి వైద్యం చేయించుకుంటే బిల్లులు( Bills) ఇవ్వడం లేదని మండిపడ్డారు. కోట్ల రూపాయలు ముందుగా చెల్లించినా.. కార్డులపై వైద్యం అందడం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు  తెలిపారు. 

Updated Date - 2022-07-15T20:45:14+05:30 IST