ఇంటర్నెట్ డెస్క్: కరోనా టీకా బూస్టర్ డోసు వేసుకున్నాం కదా అనే ధీమాతో పెద్ద పెద్ద జనసందోహాలు ఉండే కార్యక్రమాల్లో పాలు పంచుకోవద్దని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథొని ఫౌచీ హెచ్చరించారు. బూస్టర్ డోసు తీసుకున్నా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా ప్రజలను ఆయన హెచ్చరించారు. అయితే.. డెల్టా కంటే ఒమైక్రాన్ వల్ల కలిగే వ్యాధిలో తీవ్రత తక్కువగా ఉన్నట్టు ఆయన తెలిపారు. కానీ.. అమెరికా ప్రజలు మాత్రం అప్రమత్త వీడకూడదని స్పష్టం చేశారు. పిలల్ని కరోనా నుంచి కాపాడంటే వారి చుట్టూ ఉండేపెద్దలందరూ తప్పనిసరిగా కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి