Abn logo
Aug 2 2020 @ 14:14PM

సీఆర్డీయేని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు: బోండా ఉమా

విజయవాడ: సీఆర్డీయేతో రైతులు కాంట్రాక్టు అగ్రీమెంట్ ప్రకారం పూర్తిగా అభివృద్ధి జరగలేదని, కాంట్రాక్టు నిబంధనలు పూర్తి కాకుండా సీఆర్డీయేని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. అభివృద్ధి చేయకుండా సీఆర్డీయే రద్దు చేస్తే 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు లక్షా కోట్లు నష్టపరిహారం ఇవ్వవలసి వస్తుందని.. ఇస్తారా సీఎం అంటూ ప్రశించారు. జగన్ ప్రభుత్వం ముర్కంగా ముందుకు వెళుతోందని, ఇది న్యాయ పరంగా నిలబడదని అన్నారు. మూడు రాజధానులు జగన్ రాజకీయ ప్రయోజనానికేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. ఒక రాజధాని కట్టలేని జగన్ మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. జగన్ పాలనలో రాష్ట్రం 10 ఏళ్ల అభివృద్ధి వేనక్కి వెళ్ళిందని బోండా ఉమా తీవ్రస్థాయిలో విమర్శించారు.

Advertisement
Advertisement
Advertisement