Abn logo
Jun 3 2020 @ 13:07PM

పంచ భూతాలను మింగేసేలా జగన్ పాలన: బోండా ఉమ

అమరావతి: పంచ భూతాలను మింగేసే విధంగా జగన్‌ పాలన కొనసాగుతోందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. నీళ్లు, భూమి, ఇసుక.. దేన్నీ వదలడం లేదన్నారు. తాడేపల్లి కేంద్రంగా విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా సాగుతోందన్నారు. ప్రభుత్వ సలహాదారుల అండతోనే ఇసుక దందా కొనసాగుతోందన్నారు. లక్షల టన్నుల ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు.
Advertisement
Advertisement
Advertisement