Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 4 2021 @ 02:14AM

అఫ్ఘాన్‌లో బాంబు పేలుడు

కాబూల్‌, అక్టోబరు 3: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఆదివారం బాంబు పేలుడు సంభవించి ఐదుగురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్‌లోని ఈద్గా మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాలిబాన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తల్లి స్మారక కార్యక్రమం జరుగుతుండగా మసీదు ప్రవేశద్వారం వద్ద ఈ దాడి జరిగిందని తాలిబాన్‌ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు గాయపడ్డారని కాబూల్‌లోని ఇటలీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రి, ఎమర్జెన్సీ ఎన్జీఓ ట్వీట్‌ చేసింది. దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐఎస్‌ ఉగ్రవాదులే కారకులని తాలిబాన్లు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రవాసమరిన్ని...

Advertisement