ఇంటిని అమ్మకానికి పెట్టిన NRI.. చూసేందుకు వెళ్లాడో వ్యక్తి.. 15 ఏళ్లుగా మూసి ఉన్న తలుపులు తెరవగానే కనిపించిన దృశ్యం చూసి..

ABN , First Publish Date - 2021-09-16T00:53:35+05:30 IST

15 ఏళ్లుగా మూతపడి ఉన్న త్రిస్సూర్‌లోని థలికులంలో ఉన్న తన ఇంటిని ఓ ఎన్నారై ఇటీవల అమ్మకానికి పెట్టాడు.

ఇంటిని అమ్మకానికి పెట్టిన NRI.. చూసేందుకు వెళ్లాడో వ్యక్తి.. 15 ఏళ్లుగా మూసి ఉన్న తలుపులు తెరవగానే కనిపించిన దృశ్యం చూసి..

థలికులం, త్రిస్సూర్: 15 ఏళ్లుగా మూతపడి ఉన్న త్రిస్సూర్‌లోని థలికులంలో ఉన్న తన ఇంటిని ఓ ఎన్నారై ఇటీవల అమ్మకానికి పెట్టాడు. చాలా పెద్ద ఇల్లు కావడంతో అందులో హోటల్ పెట్టాలనే ఆలోచనతో ఓ వ్యక్తి దాన్ని చూసేందుకు వెళ్లాడు. అయితే, తలుపులు తెరవగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. ఎదురుగా ఓ మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అక్కడి గోడపై ఫోన్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు రాసి ఉన్నాయి. ఇంతకు ఆ మృతదేహాం ఎవరిది? చాలా రోజులుగా మూసి ఉన్న ఇంట్లో చనిపోయిన వ్యక్తి ఎందుకు వెళ్లాడు? ఈ విషయాలు తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే.


ఆరు నెలల కింద మార్చి 18న ఎంగండియూర్‌కి చెందిన 17 ఏళ్ల అమల్ క్రిష్ణ అనే యువకుడు తన తల్లి శిల్పాతో కలిసి వదనప్పల్లీ‌లోని బ్యాంకుకు వెళ్లాడు. తల్లితో కలిసి వెళ్లిన అమల్ ఆ రోజు నుంచి కనిపించకుండా పోయాడు. బ్యాంకుకు తనతో పాటు వచ్చిన కుమారుడి కోసం తల్లి ఆ చుట్టుపక్కల అంత వెతికిన ఫలితం లేకుండా పోయింది. దాంతో శిల్పా దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని అమల్ ఆచూకీ కోసం ఆరు నెలలుగా గాలిస్తున్నారు. 


ఇవి కూడా చదవండి: ఈ 28 వస్తువులను మనోళ్ల దగ్గరే కొనండి.. Saudi రాజు సంచలన ఆదేశాలు

ఇవి కూడా చదవండి: ‘ఇంటర్నెట్ స్పీడ్‌‌’లో దిగజారిన America, Canada.. టాప్10 నుంచి అవుట్.. భారత్ ఎక్కడంటే..



ఇదిలాఉంటే..  ఓ ఎన్నారై 15 ఏళ్లుగా నిరూపయోగంగా పడి ఉన్న త్రిస్సూర్‌లోని థలికులంలో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఇల్లు అమ్మకానికి ఉన్నట్లు ప్రకటన చూసిన ఓ వ్యక్తి వెంటనే థలికులం వెళ్లాడు. చాలా విశాలమైన ఇల్లు కావడంతో అందులో హోటల్ ప్రారంభించాలనేది ఆ వ్యక్తి ఐడియా. దాంతో వెంటనే ఆ ఇంటికి వెళ్లాడు. వెళ్లిన తర్వాత తలుపులు తెరవగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనైంది. ఎదుట కుళ్లిపోయిన స్థితిలో ఓ శవం కనిపించింది. గోడపై ఫోన్ నెంబర్, ఇతర వివరాలు రాసి ఉన్నాయి. దాంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వ్యక్తి సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. 


ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆధారాల కోసం క్లూస్‌టీం సాయం తీసుకున్నారు. దాంతో అక్కడ దొరికిన ఆధారాలతో అది ఆరు నెలల కింద కనిపించకుండా పోయిన అమల్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని పోలీసులు వెంటనే అమల్ తల్లి శిల్పాకు చెప్పారు. పోలీసుల సమాచారంతో అక్కడికి వచ్చిన శిల్పా.. మృతదేహం వద్ద దొరికిన ఆధారాలతో చనిపోయింది తన కుమారుడేనని నిర్ధారించింది. కాగా, అక్కడ దొరికిన ఆధారాలతో అతని తల్లి మృతదేహాన్ని గుర్తించినప్పటికీ, డీఎన్ఏ పరీక్ష తర్వాత మాత్రమే గుర్తింపు నిర్ధారించబడుతుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2021-09-16T00:53:35+05:30 IST