ప్రకాశం: జిల్లాలోని చినగంజాం మండలం పల్లెపాలెం సముద్రతీరంలో బోటును గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో వలలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. వరుస ఘటనలతో మత్స్యకారులు అందోళన చెందుతున్నారు. పోలీసులకు బోటు యాజమాని అంజయ్య ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.