ప్రేక్షకులకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2021-01-23T09:27:00+05:30 IST

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. స్థానిక చెపాక్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లు

ప్రేక్షకులకు నో ఎంట్రీ

  • తొలి రెండు టెస్టులపై బోర్డు నిర్ణయం

చెన్నై: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. స్థానిక చెపాక్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ లేకుండానే జరుగుతాయని తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) కార్యదర్శి ఆర్‌ఎస్‌ రామసామి తెలిపాడు. ‘కొవిడ్‌-19ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఫిబ్రవరి 5, 17 నుంచి జరిగే తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులు/అతిథులు/సబ్‌ కమిటీ సభ్యులకు అనుమతి లేదు’ అని రామసామి స్పష్టం చేశాడు. ఈనెల 27న ఇరు జట్లు చెన్నైకి చేరుకుని బయో బబుల్‌లో ఉంటాయి. అయితే అవుట్‌ డోర్‌ క్రీడా ఈవెంట్లను 50 శాతం ప్రేక్షకులతో నిర్వహించుకోవచ్చని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసినప్పటికీ బీసీసీఐ రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.

Updated Date - 2021-01-23T09:27:00+05:30 IST