సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2020-07-12T14:52:12+05:30 IST

సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ నెల 11న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సింగపూర్ సిటీ: సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే  సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ నెల 11న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి అత్యద్భుత స్పందన వచ్చినప్పటికీ కోవిడ్-19 సురక్షిత చర్యలలో భాగంగా ముందుగా నమోదు చేసుకొన్న 100 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. రక్తదానం చేయాల‌నుకునే దాతలు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చ‌ని నిర్వాహకులు సోమ రవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజనికి రెడ్ క్రాస్ మరియు బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలియ‌జేశారు.

Updated Date - 2020-07-12T14:52:12+05:30 IST