విక్రయించాలనుకున్న షేర్లను డీమ్యాట్‌ ఖాతాలో బ్లాక్‌ చేయడం తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-20T06:06:32+05:30 IST

ఈ ఏడాది నవంబరు 14 నుంచి ఈక్విటీ ఇన్వెస్టర్లు విక్రయించాలనుకున్న షేర్లను తప్పనిసరిగా డీమ్యాట్‌ ఖాతాలో బ్లాక్‌ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఇందుకు సంబంధించి శుక్రవారం సర్క్యులర్‌

విక్రయించాలనుకున్న షేర్లను డీమ్యాట్‌ ఖాతాలో బ్లాక్‌ చేయడం తప్పనిసరి

ఈ ఏడాది నవంబరు 14 నుంచి అమలులోకి: సెబీ 


న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబరు 14 నుంచి ఈక్విటీ ఇన్వెస్టర్లు విక్రయించాలనుకున్న షేర్లను  తప్పనిసరిగా డీమ్యాట్‌ ఖాతాలో బ్లాక్‌ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఇందుకు సంబంధించి శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఈ వసతి ఐచ్ఛికమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎర్లీ పే ఇన్‌ (ఈపీఐ) మెకానిజంలో భాగంగా, విక్రయించదలిచిన షేర్లను క్లయింట్‌ డీమ్యాట్‌ ఖాతా నుంచి ముందుగా బదిలీ చేస్తారు. విక్రయ లావాదేవీ జరగని పక్షంలో ఆ షేర్లను తిరిగి డీమ్యాట్‌ ఖాతాలోకి బదిలీ చేయడం జరుగుతుంది. అయితే, ఇందుకు సమయం పడుతుంది. పైగా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. డిపాజిటరీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం బ్లాక్‌ మెకానిజంను తప్పనిసరి చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది.


ఈ విధానంలో, క్లయింట్‌ విక్రయించదలుచుకున్న షేర్లను క్లియరింగ్‌ కార్పొరేషన్‌ తరపున (క్లయింట్‌ డీమ్యాట్‌ ఖాతాలోనే) బ్లాక్‌ చేసి ఉంచాల్సి ఉంటుంది. విక్రయ లావాదేవీ చోటు చేసుకోని పక్షంలో, షేర్లు క్లయింటు డీమ్యాట్‌ ఖాతాలోనే ఉండిపోతాయి. ట్రేడింగ్‌ సమయం ముగిశాక వాటిని అన్‌బ్లాక్‌ చేయడం జరుగుతుంది. క్లయింట్లు షేర్లు బ్లాక్‌ చేసుకునే వసతిని అందుబాటులోకి తెచ్చేందుకు డిపాజిటరీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సెబీ నిర్దేశించింది. 


ఏఐఎఫ్‌, వీసీఎ్‌ఫలకు నిబంధనల సడలింపు 

భారత్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌), వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ (వీసీఎ్‌ఫ)కు సెబీ నిబంధనలు సడలించింది. భారత్‌తో సంబంధం లేని విదేశీ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు భారత్‌తో సంబంధం కలిగిన విదేశీ కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు వీలుండేది. 

Updated Date - 2022-08-20T06:06:32+05:30 IST