హైదరాబాద్: బీజేపీ(BJP) రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను పదాధికారులకు బండి సంజయ్ వివరించనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణ తేదీలను, స్థలాన్ని నేతలు ఖరారు చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను బూతు స్థాయి వరకు తీసుకువెళ్లడంపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అర్వింద్, రఘనందనరావు, గరికపాటి, వివేక్ తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి