హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. యాసంగి సీజన్‌లో వరి వేయద్దని చెప్పినపుడు.. మరి ఏ పంట వేయాలో చెప్పాలని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ హత్యలు చేసిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రా రైస్ కొనే బాధ్యత కేంద్రానిదేనని.. వాటిని రాష్ట్రం కూడా కొని తీరాల్సిందేనన్నారు.