కరీంనగర్: సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌కు కొందరు పోలీసులు కొమ్ముకాస్తున్నారన్నారు. అరాచకాలు, కుట్రలతోనే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌పై రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి