త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు: ఆదినారాయణ

ABN , First Publish Date - 2021-12-28T23:51:17+05:30 IST

హత్యలు, దారుణాలు చేసేది వారేనని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎదుటివారిపై నిందలు మోపి తప్పుకునేది వాళ్లేనని...

త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు: ఆదినారాయణ

విజయవాడ: హత్యలు, దారుణాలు చేసేది వారేనని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బీజేపీ ప్రజాగ్రహ సభలో పాల్గొన్న ఆయన.. ఎదుటివారిపై నిందలు మోపి తప్పుకునేది వాళ్లేనని, ఇందుకు వివేకానందరెడ్డి హత్య ఉదంతమే ఉదాహరణని చెప్పారు. ఆ రోజు తన మీద నింద మోపారని, ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారని ఆదినారాయణరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-28T23:51:17+05:30 IST