హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. సంబంధంలేని వ్యక్తులు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని బీజేపీ తెలంగాణ నేతలకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి.పార్టీ ఆఫీస్‌కు వచ్చే వారిపై మానిటరింగ్ లేదని హెచ్చరించింది.పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. పార్టీ కార్యాలయానికి వెళ్లడం క్షేమం కాదని బీజేపీ ముఖ్యనేతలకు నిఘా వర్గాలు ఈ మేరకు హెచ్చరించాయి.