విజయవాడ: కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL narasimharao) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మనం ఏపీలో ఉన్నామా?... పాకిస్తాన్లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుగా అని నిలదీశారు. నిన్నటి అల్లర్లకు బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర చర్యలు సమర్థనీయం కాదన్నారు. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేద్కర్ పేరుపై వైసీపీ ప్రభుత్వం వివాదం సృష్టించిందని మండిపడ్డారు. దేశప్రజలకు సీఎం జగన్రెడ్డి(Jagan reddy) క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి