వరి ధాన్యం కొనకుండా ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదం: ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2022-04-03T22:09:51+05:30 IST

వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం పై టీఆర్ఎస్ నేతలు ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదమని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.

వరి ధాన్యం కొనకుండా ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదం: ఎంపీ అరవింద్

న్యూఢిల్లీ: వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం పై టీఆర్ఎస్ నేతలు ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదమని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. ఉద్యమపార్టీకి ప్రభుత్వం అప్పగిస్తే ఇలానే ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి గింజా కొంటామని అసెంబ్లీలో కేసీఆర్‌ అన్నారు. కానీ ఇప్పుడుకేంద్రమే కొనాలంటూ గగ్గోలు పెడుతున్నారు. 500 కోట్లతో సచివాలయం కడుతున్నారు.రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించారని ఆరవింద్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీ తీరుపై తీవ్రంగా స్పందించారు. రైతులకు వెయ్యికోట్లు ఖర్చు పెట్టలేకనే ధాన్యం కొనుగోలు పై రాద్దాంతం చేస్తున్నారని ధర్మపురి ఆరోపించారు. 


రైతులకు బోనస్ ఇవ్వలేక కేంద్రంపై నెపమా?అంటూ ప్రశ్నించారు.కేటీఆర్ కనుసన్నల్లో రీసైకిల్ బియ్యం దందా జరుగుతోందని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. కేటీఆర్ కెప్టెన్సీలో డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు.ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరాఅవుతోందని అన్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని పీయూష్ గోయల్ అన్నడట....మాదక ద్రవ్యాలను తీసుకున్న కేటీఆర్‌కు కల వచ్చిందన్నారు.కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరుతున్నానని అర్వింద్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌, కేటీఆర్ పదవిలో ఉన్నంతకాలం హైదరాబాద్ ఉడ్తా హైదరాబాద్‌గా ఉంటుందని అరవింద్ జోస్యం చెప్పారు. 

Updated Date - 2022-04-03T22:09:51+05:30 IST