కేసీఆర్ ను కొట్టాలంటే ఈగోలు పక్కన పెట్టాలి:Etala rajender

ABN , First Publish Date - 2022-07-09T21:32:40+05:30 IST

లంగాణలో కేసీఆర్ ను కొట్టాలంటే ఈగోలు పక్కనబెట్టి లక్ష్యం కోసం పనిచేయాలని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటలరాజేందర్(etala rajender) అన్నారు

కేసీఆర్ ను కొట్టాలంటే ఈగోలు పక్కన పెట్టాలి:Etala rajender

హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలంటే ఈగోలు పక్కనబెట్టి లక్ష్యం కోసం పనిచేయాలని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటలరాజేందర్(etala rajender) అన్నారు.బెంగాల్లో సువేందు అధికారి తరహాలో కేసీఆర్ ను ఓడించి తీరుతానని చెప్పారు. శనివారం మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. నా ప్రస్తానం మెదలైందే గజ్వేల్ నుంచి,అర్జునుడికి పక్షి తల మాదిరి కేసీఆర్ మాత్రమే మాకు కన్పించాలని అన్నారు.ప్రశ్నించే తత్వం సహజంగానే తెలంగాణ మట్టిలో ఉంటోందని, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. 


టీఆర్ఎస్ గ్రాఫ్(trs graff) జారుడు బండ మాదిరి పడిపోతోందని ఈటల అన్నారు.బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఆర్ చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా?టీఆర్ఎస్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని ఈటల స్పష్టం చేశారు.బీజేపీలోకి భారీ చేరికలుంటాయని, చేరికల కోసం సీక్రెట్ ఆపరేషన్ నడుస్తోందని ఆయన తెలిపారు.అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని,టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేగా కూడా ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయిందని ఈటల రాజేందర్ తెలిపారు.అసలు కేసీఆర్ కే టికెట్ కట్ చేయాలని ఆయన అన్నారు. 



Updated Date - 2022-07-09T21:32:40+05:30 IST