హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తల హల్ చల్ చేశారు. ట్రిపుల్ ఆర్ స్టికర్ అంటించిన వాహనంతో బీజేపీకి కార్యకర్తలు ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. వాహనంపై బండి సంజయ్‌తో పాటు ఎమ్మెల్యేలు రాజసింగ్, రఘనందనరావు, రాజేందర్ ఈటల ఫొటోలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా చూడు కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్యలను అరెస్టు చేయకుండా పోలీసులు పంపించి వేశారు. అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలు బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో మొక్కులు చెల్లించటానికి వెళ్ళారు. నవంబర్ 2న ప్రగతి భవన్ వద్ద ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విషయం తెలిసిందే.