అమరావతి: గుంటూరులోని జిన్నా టవర్ మీద జాతీయ జెండా ఎగురవేయనందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పుడు గుర్తొచ్చిందన్నది అసలు విషయం కాదని, జరిగిన తప్పును సరిదిద్దటానికి ప్రయత్నిస్తున్నామా లేదా అన్నదే అసలు విషయమని, దాన్ని మంత్రి శ్రీనివాస్ తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేయకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఓక భారతీయ పౌరుడుగా మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. దేశ విద్రోహక శక్తులకు మీరు కొమ్ముకాస్తున్నారనేది వాస్తవమని ఆయన పేర్కొన్నారు. జిన్నా టవర్ మీద ఓటు బ్యాంకు రాజకీయం చేయడం వైసీపీ మానుకోవాలన్నారు. మీకు దేశభక్తి ఉంటే జిన్నా టవర్ పేరు మార్చి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. జిన్నా టవర్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి