హైదరాబాద్: బీజేపీ నాయకురాలు విజయశాంతికి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. దీంతో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగే కీలక నేతల సమావేశంలో విజయశాంతి పాల్గొనున్నారు. ఇప్పటికే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బీజేపీ అధిష్టానంతో విజయశాంతి భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై హోంమంత్రికి పూర్తి వివరాలు అందించే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి