తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు బీజేపీదే: Lanka dinakar
ABN , First Publish Date - 2022-03-10T16:12:29+05:30 IST
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండవసారి సీఎం కావడం బీజేపీ చారిత్రాత్మక విజయమని ఆ పార్టీ లంకా దినకర్ అన్నారు.
అమరావతి: ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండవసారి సీఎం కావడం బీజేపీ చారిత్రాత్మక విజయమని ఆ పార్టీ నేత లంకా దినకర్ అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ బీజేపీ నాయకులకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగిల జోడీ నవ భారతవనికి నాందని అని అన్నారు. దేశంలో కాంగ్రెస్ ఎక్కడ లేకపోవడం నేటి ఫలితాల్లో దేశ భవిష్యత్తు రాజకీయల్లో కీలకమైన అంశమని లంకా దినకర్ పేర్కొన్నారు.