Abn logo
Sep 14 2021 @ 17:44PM

నివురు గప్పిన నిప్పులా హుజురాబాద్: ఈటెల

కరీంనగర్: నివురు గప్పిన నిప్పులా హుజురాబాద్ ఉందని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి  ఈటెల రాజేందర్ అన్నారు. ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అని ఆయన పేర్కొన్నారు. సెప్టంబర్ 17ను అధికారికంగా జరపాలని ఆయన డిమాండ్ చేసారు. ఎవరికి భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. దౌర్జన్యాలు, దురాగతాలు, దుర్మార్గాలు హుజురాబాద్‌లో చెల్లవన్నారు. చాకలి  ఐలమ్మ సీఎం కాదని, కానీ ప్రజలకోసం ప్రాణం అర్పించారన్నారు.


చరిత్ర హీనులను, చరిత్ర వీరులను ఇద్దరినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. హిట్లర్ చరిత్ర హీనుడు అయితే, మన శ్రీకాంత చారి చరిత్ర వీరుడని ఆయన అన్నారు. నివురు గప్పిన నిప్పులా  హుజురాబాద్ ఉందని, 2006 ఉప ఎన్నిక రిపీట్ అవుతుందని ఈటెల అభిప్రాయపడ్డారు. 

క్రైమ్ మరిన్ని...