Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీ మతతత్వ పార్టీయే..నేను మతతత్వ వాదినే: సంజయ్

ములుగు: బీజేపీ మతతత్వ పార్టీయే.. తాను మతతత్వ వాదినేనని బీజేపీ నేత సంజయ్ స్పష్టం చేశారు. ములుగులో ఎన్నికల ప్రచారంలో సంజయ్ మాట్లాడుతూ 80 శాతం హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేది ఏమీ లేదన్నారు. ఒక వర్గానికి కొమ్మకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగని కేసీఆర్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ వీడుతారో తెలియదన్నారు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎకరం భూమి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వ్యాగన్‌ ఫ్యాక్టరీ కోసం 164 ఎకరాల వివాదాస్పద భూమి ఇచ్చారని సంజయ్ తప్పుబట్టారు.

Advertisement
Advertisement