హైదరాబాద్: గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై చర్చకు బీజేపీ(bjp) సిద్దంగా వుందని తెలంగాణ బిజెపి ఇన్ చార్జి తరుణ్ చుగ్(tarun chug) పేర్కొన్నారు. మోదీ సభ తెలంగాణ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సీఎం కేసీఆర్(cm kcr) మోసం చేశారని, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జంతర్ మంతర్ తాంత్రిక్ సర్కార్ నడుస్తోందని తరుణ్‌చుగ్ ఎద్దేవా చేశారు.కేసీఆర్ సర్కార్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి