బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్‎లోకి నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు

ABN , First Publish Date - 2022-07-01T00:44:55+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందు బీజేపీ (Bjp)కి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా..

బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్‎లోకి నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందు బీజేపీ (Bjp)కి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జులై  2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఒకరోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్‎లో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ (Banothu Sujatha Naik), రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు  అర్చన ప్రకాష్ (Archana Prakash), జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్ (Derangula Venkatesh), అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్ (Sunitha Prakash Goud), తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్ (Sindhuja Goud), కౌన్సిలర్ ఆసిఫ్ (Counsellor) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister Ktr) సమక్షంలో టీఆర్ఎస్‎లో చేరారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (Mp Ranjith Reddy), ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ (Maganti Gopinath), ఎమ్మెల్యే దానం నాగేందర్ (Mla Nagendhar), పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి కార్పొరేటర్లను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ (Pm Modi) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్‎ (Trs) లో చేరడం బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. 





Updated Date - 2022-07-01T00:44:55+05:30 IST