బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 35 % డౌన్... ఎందుకంటే...

ABN , First Publish Date - 2021-03-04T00:19:03+05:30 IST

బిట్ కాయిన్ విలువ ఇటీవలి కాలంలో అంతకంతకూ పడిపోతోంది. పదేళ్ళ కిందట... 2010 జూలైలో 0.08 డాలర్లతో ప్రారంభమైన బిట్ కాయిన్ ప్రస్తానం గత నెలలో ఏకంగా 58 వేల డాలర్లను దాటిపోయింది.

బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 35 % డౌన్... ఎందుకంటే...

ముంబై : బిట్ కాయిన్ విలువ ఇటీవలి కాలంలో అంతకంతకూ పడిపోతోంది. పదేళ్ళ కిందట... 2010 జూలైలో 0.08 డాలర్లతో ప్రారంభమైన బిట్ కాయిన్ ప్రస్తానం గత నెలలో ఏకంగా 58 వేల డాలర్లను దాటిపోయింది. అయితే ఆ తర్వాత క్రమంగా 45వేల డాలర్లకు పడిపోయింది. బిట్ కాయిన్ విలువ పడిపోవడంతో క్రిప్టో కరెన్సీలో కూడా దీని మార్కెట్ క్యాప్ పడిపోతోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. ఇక... 2013 మే నాటికి క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ మార్కెట్ విలువ 94 శాతంగా ఉంది. ఫిబ్రవరి 2017 లో బిట్ కాయిన్ వాటా 86 శాతానికి పడిపోయింది. అదే సంవత్సరం జూన్ నెలకు మరో 37 శాతం తగ్గింది. అయినప్పటికీ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో బిట్ కాయిన్ వేపు మొగ్గుచూపారు.


పడిపోయిన బిట్ కాయిన్ మార్కెట్ వాటా...

బిట్ కాయిన్ కొనుగోలు పెరగడంతో ఈ ఏడాది(2021) మార్చి 1 నాటికి మార్కెట్ వాటా 61.11 శాతంగా నమోదైంది. కాగా... 2013 నాటికి బిట్ కాయిన్ మార్కెట్ వాటా 94 శాతంగా ఉంది. అంటే... ఈ ఎనిమిదేళ్లలో బిట్ కాయిన్ దాదాపు 35 శాతం మార్కెట్ వాటాను కోల్పోయింది. బిట్ కాయిన్ వాటా పడిపోవడానికి ప్రధానంగా పోటీ డిజిటల్ కరెన్సీలు రంగప్రవేశం చేయడమే. కొన్నేళ్లుగా కొత్త కొత్త డిజిటల్ కరెన్సీల మార్కెట్లోకి వస్తోన్న విషయం తెలిసిందే. 


పెరుగుతున్న మార్కెట్... కొత్త కొత్త డిజిటల్ కరెన్సీలు వస్తుండటంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ సైజ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు క్రిప్టో వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో భారీగా రిటర్న్స్ ఇచ్చిన వాటిలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. ఈ క్రమంలోనే... బిట్ కాయిన్ వేపు పలువురు దృష్టి సారిస్తున్నారు. అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ పెరుగుతున్నప్పటికీ కొత్త కరెన్సీ రాకతో బిట్ కాయిన్ వాటా కాస్త తగ్గింది. 


Updated Date - 2021-03-04T00:19:03+05:30 IST