ఆ విధానంతో ఆటగాళ్ల భద్రతకు భరోసా లేదు: ద్రావిడ్

ABN , First Publish Date - 2020-05-27T02:17:55+05:30 IST

కరోనా నేపథ్యంలో క్రికెట్‌ పూర్తిగా మూలన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రీడను పునరుద్ధరించేందుకు...

ఆ విధానంతో ఆటగాళ్ల భద్రతకు భరోసా లేదు: ద్రావిడ్

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో క్రికెట్‌ పూర్తిగా మూలన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రీడను పునరుద్ధరించేందుకు పలు దేశాల క్రికెట్ బోర్డులు అనేక విధానాలను ముందుకు తీసుకొస్తున్నాయి. వాటిలో ఒకటి బయో బబుల్ విధానం. దీని ప్రకారం.. మ్యాచ్ ఆడే ఆటగాళ్లను నిర్ణీత కాలం ముందుగానే క్వారంటైన్ చేస్తారు. వారిని హై సెక్యూరిటీలో ఉంచి మ్యాచ్ రోజున గ్రౌండ్‌కు పంపిస్తారు. అయితే ఈ విధానంపై భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ పెదవి విరిచారు. ఈ విధానం అంత గొప్పగా  ఏం లేదని, ఇది ఆచరణలో అంత ఫలితాన్ని చూపదని పేర్కొన్నారు.


‘ఆటగాళ్లను క్వారంటైన్ చేసి వారిని పూర్తి సెక్యూరిటీలో ఉంచడం సరే. ఏదైనా టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు రెండో రోజు ఆట తరువాత ఎవరైనా  ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే పరిస్థితేంటి..? దీని వల్ల ఆ టెస్టే కాదు పూర్తిగా సిరీస్ నిర్వహణే అకస్మాత్తుగా ముగిసిపోతుంది. అంతే కాకుండా అలాంటి పరిస్థితుల్లో మిగతా ఆటగాళ్ల భద్రత కూడా కష్టమవుతుంది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-27T02:17:55+05:30 IST