విజయవాడ: తనను నమ్ముకున్న అస్మదీయులకు సీఎం జగన్ వేలకోట్లు దోచిపెడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 22 నెలల్లో వివిధ పత్రికల్లో ప్రకటనల కోసమే వందల కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఉమ ఘాటుగా విమర్శించారు. తన సొంత సంస్థలకే 106 కోట్లు కేటాయించారని ఆయన ఆరోపించారు. ఇవికాక మిగిలిన నిధులను ఇతర పత్రికలకు నామమాత్రంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ సొంత సంస్థలకు ప్రకటనలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు.