బ్రిటన్ రాణిని కలిసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు
ABN , First Publish Date - 2021-06-14T12:40:39+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్.. ఇంగ్లండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ IIను కలిశారు. విండ్‌సర్ కోటలో ఆమెను ఈ దంపతులు కలిశారు.
లండన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్.. ఇంగ్లండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ IIను కలిశారు. విండ్‌సర్ కోటలో ఆమెను ఈ దంపతులు కలిశారు. జీ7 దేశాల నాయకులు రాణి కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో కూడా బైడెన్.. క్వీన్ ఎలిజబెత్ IIను కలిశారు. కాగా, బైడెన్‌ను విండ్‌సర్ కోటలో కలవడానికి ఎలిజబెత్ కొన్ని రోజులుగా సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెను బైడెన్ దంపతులు కలిశారు. ఈ మీటింగ్ తర్వాత బైడెన్ బెల్జియం వెళ్తారు. ఆయన అక్కడ నాటో సమాఖ్యలో పాల్గొనాల్సి ఉంది.