వంద రోజుల్లో పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు సాధ్యమే: డాక్టర్ ఆంథనీ ఫౌచీ

ABN , First Publish Date - 2021-01-19T00:33:04+05:30 IST

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి

వంద రోజుల్లో పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు సాధ్యమే: డాక్టర్ ఆంథనీ ఫౌచీ

వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా కరోనా మహమ్మారిపైనే ఎక్కువ దృష్టి సారించనున్నట్టు జో బైడెన్ ఇప్పటికే అనేక సార్లు చెప్పారు. డెమొక్రాటిక్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏం కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ఇప్పటికే బైడెన్ బృందం పనిచేస్తోంది. తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు జో బైడెన్ చెప్పారు. జో బైడెన్ వ్యాఖ్యలపై తాజాగా అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథనీ ఫౌచీ స్పందించారు. 


జో బైడెన్ పెట్టుకున్న లక్ష్యాన్ని చేధించవచ్చని ఆయన అన్నారు. ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన వ్యాక్సిన్లు త్వరలోనే అప్రూవల్‌కు దరఖాస్తు చేసుకోబోతున్నాయని ఆయన చెప్పారు. ఆ వ్యాక్సిన్లకు కూడా అప్రూవల్ లభిస్తే వంద రోజుల్లో పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వేయాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చునని ఆంథనీ ఫౌచీ పేర్కొన్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటికే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అప్రూవల్ లభించడం, ప్రజలకు వ్యాక్సిన్ డోస్‌లను వేయడం కూడా జరుగుతోంది. అమెరికా జనాభాలో ఇప్పటివరకు 3.2 శాతం మందికి వ్యాక్సిన్ డోస్ ఇచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Updated Date - 2021-01-19T00:33:04+05:30 IST