జో బైడెన్ ఫొటో వైరల్.. బుష్‌ను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-10-23T23:16:17+05:30 IST

డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోను చూసిన వారందరూ రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్.డబ్ల్యూ.

జో బైడెన్ ఫొటో వైరల్.. బుష్‌ను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు!

వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోను చూసిన వారందరూ రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్.డబ్ల్యూ.బుష్‌ను గుర్తు చేసుకుంటున్నారు. మాజీ అధ్యక్షుడ్ని ప్రజలు ఎందుకు అలా గుర్తు చేసుకుంటన్నారనే వివరాళ్లోకి వెళితే.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్.. గురువారం రోజు రాత్రి చివరి డిబేట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ముఖాముఖిలో భాగంగా వివిధ అంశాలపై చర్చించుకుంటూ వీరిద్దరూ సమయాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో డిబేట్‌కు సందానకర్తగా వ్యవహరించిన క్రిస్టెన్ వెల్కర్.. అభ్యర్థులిద్దరికీ సమయాన్ని గుర్తుచేశారు. 10 నిమిషాల్లో చర్చను ముగించాలని సూచించారు. 


ఈ క్రమంలో జో బైడెన్ తన చేతికున్న గడియారంలో టైం చూసుకున్నారు. జో బైడెన్ టైం చూసుకుంటున్న సందర్భానికి సంబంధించిన ఫొటోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జో బైడెన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 1992లో నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో జార్జి బుష్ కూడా ఇలానే టైమ్ చూసుకున్నారని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. అయితే డిబేట్ మధ్యలో జార్జి బుష్.. టైమ్ చూసుకోవడంపట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. డిబేట్‌లో భాగంగా అధ్యక్ష అభ్యర్థులకు ప్రజలు కొన్ని ప్రశ్నలను సంధించారు. ప్రజలు అడిగిన ప్రశ్నలు జార్జి బుష్‌కు రుచించలేదు. దీంతో ఆయన తన చేతికున్న గడియారంలో పదే పదే టైమ్ చూసుకున్నారు. దీంతో ప్రజలు జార్జి బుష్ వైఖరిని తప్పుబట్టారు. 

Updated Date - 2020-10-23T23:16:17+05:30 IST