తగ్గుతున్న బైడెన్ పాపులారిటీ.. ఒక్క నెలలో ఇంతా?

ABN , First Publish Date - 2021-08-04T10:26:50+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన యూఎస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన జోబైడెన్.. ప్రస్తుతం ప్రజల్లో

తగ్గుతున్న బైడెన్ పాపులారిటీ.. ఒక్క నెలలో ఇంతా?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన యూఎస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన జోబైడెన్.. ప్రస్తుతం ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కరోనాపై ట్రంప్ వైఫల్యాలను ప్రధానంగా ఎండగట్టిన బైడెన్.. ఇప్పుడు కరోనా వల్లే సగం చిక్కుల్లో పడ్డారట. తాజాగా చేసిన హార్వర్డ్-హ్యారిస్ పోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జూన్ నెలలో అమెరికన్లలో 62శాతం ప్రజలు బైడెన్‌కు మద్దతుగా నిలిచారట. అయితే అదే నెల చివరకు వచ్చే సరిక ఈ సంఖ్య ఏకంగా 10శాతం  తగ్గి 52శాతానికి చేరింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్న ‘డెల్టా వేరియంట్’ అని తెలుస్తోంది. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం మరోసారి విఫలమైందని ప్రజలు అనుమానిస్తున్నారు. అలాగే మళ్లీ మాస్కు తప్పనిసరి నిబంధన రావడం, కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో అమెరికన్లు భయపడిపోతున్నారు. అలాగే కొంతమంది అమెరికా ఆర్థిక వ్యవస్థ వెళ్తున్న మార్గంపై కూడా అనుమానాలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగోలేదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.  అయితే చాలామంది మాత్రం ప్రస్తుతం అమెరికా ఎకానమీ బాగానే ఉందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డెమొక్రాట్ పార్టీతోపాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలిచే రిపబ్లికన్ పార్టీపై కూడా ప్రజల్లో మద్దతు సన్నగిల్లుతున్నట్లు ఈ సర్వే చెప్తోంది.

Updated Date - 2021-08-04T10:26:50+05:30 IST