ఎంఓసీలో భూటియా, అంజు

ABN , First Publish Date - 2021-12-03T08:28:39+05:30 IST

మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ)లో మాజీ ఫుట్‌బాలర్‌ బైచుంగ్‌ భూటియా, లాంగ్‌జంప్‌ దిగ్గజం అంజూ బాబీ జార్జ్‌సహా మొత్తం ఏడుగురు మాజీ అథ్లెట్లకు చోటు దక్కింది.

ఎంఓసీలో భూటియా, అంజు

న్యూఢిల్లీ: మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ)లో మాజీ ఫుట్‌బాలర్‌ బైచుంగ్‌ భూటియా, లాంగ్‌జంప్‌ దిగ్గజం అంజూ బాబీ జార్జ్‌సహా మొత్తం ఏడుగురు మాజీ అథ్లెట్లకు చోటు దక్కింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మరిన్ని పతకాలు నెగ్గడమే లక్ష్యంగా టాప్స్‌ పథకాన్ని ఈ సెల్‌ నడిపిస్తోంది. పునర్‌వ్యవస్థీకరించిన ఎంఓసీలో హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌, షూటింగ్‌ లెజెండ్‌ అంజలీ భగవత్‌, మాజీ హాకీ సారథి వీరేన్‌ రస్కిన్హా, టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మోనోలిసా మెహతా, ఏస్‌ షట్లర్‌ తృప్తి ముర్గుండేకు కూడా స్థానం లభించినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో, పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాలు కొల్లగొట్టడంలో ఎంఓసీ ఎంతో కీలకపాత్ర పోషించిందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశంసించారు. 

Updated Date - 2021-12-03T08:28:39+05:30 IST