జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం పీఎస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఐ ఉదయ్ కిరణ్ తనను అకారణంగా కొట్టారంటూ పురుగుల మందు తాగిన ప్రశాంత్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు, మృతుడి బంధువులు ధర్నా, ఆందోళన చేశారు. ఆందోళనలు చేస్తారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు.
ఇవి కూడా చదవండి